Showing posts with label natural health tips. Show all posts
Showing posts with label natural health tips. Show all posts

Saturday, 22 June 2019

డా రామచంద్ర ఫోన్ నెంబర్ , అడ్రస్ - Dr Ramachandra phone number and address

డా రామచంద్ర ఫోన్ నెంబర్ , అడ్రస్ - 

Dr Ramachandra phone number and address


డా రామచంద్ర గారి డైట్ పాటించే వారు , రామచంద్ర గారి ప్రకృతి ఆశ్రమం సందర్శించి , డాక్టర్ గారిని కలవాలి అనుకుంటే, వారి ఫోన్ నెంబర్ కి  ఫోన్ చేసి అపాయింట్ మెంట్ ని తిసుకోగలరు.


Phone No: 9966666627 


అడ్రస్: 
ప్రకృతి ఆశ్రమం,
సిదార్థ యోగ విద్యాలయం,                         

నేలకొండపల్లి బౌద్ధ స్తూపం ఎదురుగా ,
ఖమ్మం జిల్లా,
తెలంగాణ.



Address:

Prakruthi Ashramam,
Siddartha Yoga Vidyalayam,
Opp: Buddhist stupa,
Nelakondapalli ,
Dist: Khammam,
Telangana.












Dr Ramachandra address and phone Number: 























dr ramachandra phone number, dr ramachandra 15 days diet plan, dr ramachnadra 15days diet sheet, dr ramachandra 15days  diet, dr ramachandra adderss , dr ramachandra phone , dr ramachandra nelakondapalli, 

Monday, 10 June 2019

డా రామచంద్ర సిద్దార్థ యోగ విద్యాలయం - Dr Ramachandra diet Plan Sheet Full details


డా రామచంద్ర సిద్దార్థ యోగ విద్యాలయం -

 Dr Ramachandra diet Plan Full details 



డైట్ షీట్


👉 ఉదయం ముఖం కడగగా నే రెండు గ్లాసుల నీరు తాగాలి. గంట తరువాత మళ్ళీ రెండు గ్లాసుల నీరు తాగాలి.
 👉టిఫిన్ కి 30 నిమిషాల ముందు గ్లాస్ జ్యూస్ తాగాలి. వీటిలో తేనే, నిమ్మరసం కలపాలి.
👉 టిఫిన్ గా తేలికైన ఆహారాలు తీసుకోవాలి. నూనెలో వేయించినవి తినవద్దు.
👉  భోజనానికి 30 నిముషాల ముందు రెండు గ్లాసుల నీరు తాగాలి. భోజనం ముగిసిన గంటన్నర నుండి ప్రతీ గంటకూ ఒక గ్లాసు నీరు తాగాలి.
👉 అన్నం లో 50% కూర తినాలి. ఆకు కూరలు ఎక్కువ వాడాలి. ఉప్పు,  కారం,  నూనెలు బాగా తగ్గించాలి.
👉 రుచి కోసం పల్లీ పొడి, కొబ్బరి పొడి, నువ్వుల పొడి, మినుముల పొడి కలుపుకోవాలి.
👉 మాంసం, చాపలు, కోడి గుడ్డు, నిల్వ పచ్చడి, బిర్యానీలు, పాకెట్ పాలు వాడవద్దు.
👉 సాయంత్రం నాలుగున్నర గంటలకు గ్లాస్ జ్యూస్ తాగాలి.👉🏻 సాయంత్రం ఐదున్నర గంటలకు రెండు గ్లాసుల నీరు తాగాలి.
👉 సూర్యాస్తమయం లోపు రాత్రి భోజనం తినడం పూర్తి కావాలి.
👉 రాత్రి డిన్నర్ లో పండ్లు తినాలి. బొప్పాయి, జామ, పుచ్చకాయ, దానిమ్మ, బత్తాయి, కమలా మొదలైనవి తినాలి.
👉 వీలుని బట్టి రోజులో మూడు నుంచి నాలుగు గ్లాసులు మజ్జిగ తాగాలి.

*Dr.K.Y.Ramachandra
Chairman
SIDDHARTHA YOGA VIDYALAYAM
.

డా.రామచంద్ర (BNYS) గారు సిద్దార్థ యోగా విద్యాలయం, ప్రకృతి ఆశ్రమం, నేలకొండపల్లి (ఖమ్మం జిల్లా) అనే అడ్రస్ లో (ప్రఖ్యాత బౌద్ధ స్థూపం ఎదురుగా) ప్రతి బుధ, గురువారం కన్సల్టెన్సీ కి అందుబాటులో ఉంటారు. మీరు డాక్టర్ ను నేరుగా కలిసి మీ అనారోగ్య సమస్యలకు పరిష్కారాలు అడగాలనుకుంటే మీ పాత రిపోర్టుల ఫైల్ తో కలవొచ్చు. డాక్టర్ గారి సెల్ నంబర్ 9966666627...






















Saturday, 18 May 2019

ఈ బెల్లం చాలా డేంజర్ - yellow jaggery side effects to health

ఈ బెల్లం చాలా డేంజర్ - 

yellow jaggery side effects to health


ఇప్పుడు మనకి మార్కెట్ లో దొరుకుతున్న బెల్లానికి , కొన్ని సంవత్సరాల క్రితం వాడిన బెల్లానికి అసలు పోలికే లేదు.
అసలు చెరకు బెల్లం Golden brown to dark brown కలర్ లో  ఉంటుంది. కాని ఈ వ్యాపారులు దురాశతో , కేవలం ఆకర్షనీయంగా ఈ బెల్లం కనపడడానికి, ఎక్కువ మొత్తంలో వ్యాపారం చేయడానికి , ఇది తయారుచేసేపుడు దీనికి అమ్మోనియం సల్ఫేట్, సోడియం హైడ్రో సల్ఫేట్ వంటి హానికర రసాయనాలు కలుపుతున్నారు .

ఇవ్వి ఎంత హానికరం అంటే ఈ రసాయనాలని నేరుగా ఒక 30 గ్రా|| తీసుకుంటే చనిపోయే ప్రమాదం ఉంది.
కాబట్టి వీటిపై మనమే అవగాహన తెచ్చుకొని వాడకుండా ఉండాలి, ప్రభుత్వాలు వచ్చి రైడ్ చేసి, banned చేసిన కొనేవాళ్ళు ఉన్నంతసేపు వీళ్ళ వ్యాపారం జరుగుతూనే ఉంటుంది . మనమే మనకి కావలసినవి డిమాండ్ చేస్తే , కొంతైన వచ్చే తరాలకి మేలు చేకూరుతుంది.




video:


                           

Monday, 13 May 2019

జుట్టు రాలడం ఆగి , తిరిగి పెరగానికి మందార తైలం తయారీ - Hibiscus oil for New hair regrowth


జుట్టు రాలడం ఆగి , తిరిగి పెరగానికి మందార తైలం తయారీ - 

Hibiscus oil for New hair regrowth 





ఈ రోజుల్లో ఎక్కువ మందిని వేదిస్తున్న సమస్య జుట్టు రాలిపోవడం.  వెంట్రుకలు రాలిపోడానికి చాలా కారణాలు ఉంటాయి. అయితే రాలిపోతున్న జుట్టు ని ఆపి , తిరిగి వెంట్రుకలు మొలిపించే దాంట్లో ప్రకృతిలో సహజసిద్ధమైనది మందార. ఈ మందారకు మాత్రమే జుట్టుని తిరిగి రప్పించే గుణం ఉందట.
విదానం:
10 మందార పూలు తీసుకోండి.  దాన్ని మెత్తగా పేస్ట్ లాగా చేయండి, ఇపుడు దీన్ని మీరు అలాగే తలకి రాసుకొని కొద్దిసేపటి తర్వాత స్నానం చేయవచు.
అయితే ఈ మందార పూలు ఎక్కవగా వేసవిలో పూస్తాయి, దీన్ని ఎప్పటికి వాడలనుకుంటే మందార పూలలోని గుణాలని తైలం లోకి రప్పివాలి. దానికి గాను ఈ మందార ముద్దని ఒక గాజు సీసాలోకి తీసుకోని, స్వచమైన కొబ్బరినూనె ని పోయాలి.

తర్వాత దాన్ని ఎండలో ఒక 5 నుంచి 6 రోజుల పాటు ఉంచాలి. దీంతో మందార లోని గుణాలన్నీ ఆ నూనె లోకి వస్తాయి. ఇపుడు దీన్ని తలకి రాసుకోవచు.
దీన్ని వాడుతూ ఉంటె జుట్టు రాలడం ఆగిపోయి , తిరిగి జుట్టు మొలవడం మొదలవుతుంది.


VIDEO:





Sunday, 28 April 2019

మీ ఇంటిలోనే టూత్ పేస్ట్ ని తయారుచేసుకోండి - Natural Tooth paste at Home recipe

మీ ఇంటిలోనే టూత్ పేస్ట్ ని తయారుచేసుకోండి - 

Natural Tooth paste at Home recipe 









మనం రోజు ఉదయాన్నే చేసే బ్రష్ , మన ఆరోగ్యానికి మొదటి మెట్టు.
మన అమ్మమ్మ, తాతల కాలంలో ఈ రసాయన Toothpaste లు లేవు. వేపపుల్ల, బొగ్గు, ఉప్పు తో బ్రష్ చేసే వారు. ఇపుడు ఈ రసాయన పేస్ట్ లని అలవాటు చేసి మీ toothpaste లో ఉప్పు ఉందా అని అడుగుతున్నారు.

వేప యొక్క చేదు మనిషికి చాలా మేలు చేస్తుంది. ఈ చేదు ఉదయాన్నే నోటికి తాకితే నోరు మాత్రమే శుభ్రం కాకుండా శరీరం మొత్తాన్ని ఉత్తేజపరుస్తుంది.
వేప పుల్లతో బ్రష్ చేస్తే చేయండి, లేదా వేపాకు తో పళ్ళ పొడి మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.


కావలసిన పధార్థాలు:

1.వేపాకు పొడి (Neem Powder)– 100 గ్రా||
2.కల్ ఉప్పు (Sea salt) – 20 గ్రా||
3.లవంగం + దాల్చినచెక్క (cloves + cinnamon) – 5 గ్రా||
4.అతిమదురం (Athimaduram ) – 20 గ్రా||   {available in Ayurvedic shops}
5.వాము + ధనియాలు + జీలకర్ర + సోపు (bishopsweed+ coriander + cumin + Fennel ) = 100 గ్రా||

Note: జీలకర్ర , ధనియాలని దోరగా వేయించండి.

వీటిని పొడిచేసి అన్నిటిని కలపండి.