ఉగాది పచ్చడి చెప్పేది ఏమిటి ? -
Real facts about ugadi pachadi and its 6 tastes
ఉగాది రోజు చేసే పచ్చడి 6 రకాల రుచుల సమ్మేలనం .చేదు,వగరు,తీపి ,పులుపు,ఉప్పు,కారం .
ఈ షడ్రుచులు రోజు మన నోటికి తాకాలని మన పూర్వికులు ఇలా ఉగాది పచ్చడి రూపంలో మనకి పరిచయం చేసారు .
ఈ 6 రకాల రుచులు ప్రతిరోజూ మన ఆహారంలో ఉంటె మనకి ఏ జబ్బులు రాకుండా ఉంటాయి.
వీటిల్లో మనం అప్పటికే చేదు , వగరు రుచిని మరిచిపోయాం ..
ఇక మిగతా తీపి,పులుపు,ఉప్పు, కారం ఇవ్వన్నీ కూడా కల్తీవే తింటున్నాం ..
ఒకప్పుడు బ్రష్ చేయడానికి వేప పుల్లని వాడే వారు , దింతో చేదు పొద్దునే నోటికి తాకి శరీరాన్ని శుబ్రపరిచేది , ఈ చేదు వల్ల ప్రతి శరీరంలోని ప్రతిజీవకణం ఉత్తేజం అయ్యేది .
కానీ ఇప్పుడు chemical toothpaste లని వాడుతున్నాం .
వగరు రుచిని కూడా మర్చిపోయాం , ఇది గానుగ ఆడించిన పల్లి,నువ్వుల నూనెల్లో మనకి లభిస్తుంది , కాని మనం ఇపుడు రిఫైన్డ్ ఆయిల్స్ నే వాడుతూ లేనిపోని రోగాలు తెచ్చుకుంటున్నాం .
ఉప్పు - కల్లుప్పు వాడినన్నాళ్లు మనం బాగున్నాం , ఈ థైరాయిడ్ , బి. పి , కిడ్నీసమస్యలు రాలేదు . కానీ ఈ పాకెట్స్ లో దొరికే Iodized Salt తింటున్నప్పటి నుండి అనారోగ్య సమస్యలు మొదలైనాయి .
కారం ని పచ్చిమిర్చి పండుపండాక ఎండబెట్టి దాని పట్టించి కరంగా వాడే వారం , ఇపుడు ప్యాకెట్ కారం వచ్చి చేరింది .
తీపి విషయానికి వస్తే నల్ల బెల్లం , తాటి బెల్లం , పటిక బెల్లం వాడేవాళ్ళం , కానీ ఇపుడు పసుపు రంగు బెల్లం దొరుకుంటుంది మనకి , బెల్లం పసుపు రంగుకు రావడానికి దానికి అల్యూమినియం సల్ఫేట్ ని కలుపుతారు ,
కేవలం మంచిగా కనపడడానికి . ఇది చాల డేంజర్ కెమికల్ . దీన్ని 50గ్రాములు నేరుగా తింటే చనిపోతారు .
పులుపు విషయానికి వస్తే మనకి చాల రకాల పులుపులు ఉన్నాయ్ , ఉసిరి,మామిడి, చింత ,దెబ్బకాయ , నారింజ.. ఇలా కాలాన్ని బట్టి ఈ పులుపులని ఎంజాయ్ చేసేవారం . కానీ ఇపుడు రోజు చింతపండు పులుసు తాగుతున్నాం .. ఇది రోజు తాగితే మలబద్దకం ఏర్పడుతుంది .
ఇలా అన్ని రకాల కల్తీ పదార్తలతో ఉగాది పచ్చడిని కూడా కల్తీచేసి తాగుతున్నాం ..
కాబట్టి కొంచెం కష్టపడి ఐన సరే .. మన పాతకాల రుచులని కల్తీలేకుండా రోజు మీ ఆహారంలో ఈ 6 రకాల రుచులు ఆస్వాదించి ఆరోగ్యంగా జీవిస్తారని మా మనవి .
No comments:
Post a Comment