Sunday, 28 April 2019

మీ ఇంటిలోనే టూత్ పేస్ట్ ని తయారుచేసుకోండి - Natural Tooth paste at Home recipe

మీ ఇంటిలోనే టూత్ పేస్ట్ ని తయారుచేసుకోండి - 

Natural Tooth paste at Home recipe 









మనం రోజు ఉదయాన్నే చేసే బ్రష్ , మన ఆరోగ్యానికి మొదటి మెట్టు.
మన అమ్మమ్మ, తాతల కాలంలో ఈ రసాయన Toothpaste లు లేవు. వేపపుల్ల, బొగ్గు, ఉప్పు తో బ్రష్ చేసే వారు. ఇపుడు ఈ రసాయన పేస్ట్ లని అలవాటు చేసి మీ toothpaste లో ఉప్పు ఉందా అని అడుగుతున్నారు.

వేప యొక్క చేదు మనిషికి చాలా మేలు చేస్తుంది. ఈ చేదు ఉదయాన్నే నోటికి తాకితే నోరు మాత్రమే శుభ్రం కాకుండా శరీరం మొత్తాన్ని ఉత్తేజపరుస్తుంది.
వేప పుల్లతో బ్రష్ చేస్తే చేయండి, లేదా వేపాకు తో పళ్ళ పొడి మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.


కావలసిన పధార్థాలు:

1.వేపాకు పొడి (Neem Powder)– 100 గ్రా||
2.కల్ ఉప్పు (Sea salt) – 20 గ్రా||
3.లవంగం + దాల్చినచెక్క (cloves + cinnamon) – 5 గ్రా||
4.అతిమదురం (Athimaduram ) – 20 గ్రా||   {available in Ayurvedic shops}
5.వాము + ధనియాలు + జీలకర్ర + సోపు (bishopsweed+ coriander + cumin + Fennel ) = 100 గ్రా||

Note: జీలకర్ర , ధనియాలని దోరగా వేయించండి.

వీటిని పొడిచేసి అన్నిటిని కలపండి.









No comments:

Post a Comment